Wednesday, August 5, 2009

A sad love song

మిడిసిపడే దీపానీవి
మిన్నెగసిపడే కెరటానివి
వెలుగు పంచలేవు ఏ దరికి చెరుకోవు
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ
సుఖదు:ఖాలే ఏకమైన రేవులో
-- మిడిసిపడే --
బావి లోతు ఇంతని తెలుసు
నదుల లోతు కొంతే తెలుసు
ఆడ గుండె లోతు ఎంతో లోకంలో ఎవరికి తెలుసు
ఏ నిముషం ప్రేమిస్తుందో ఏ నిముషం పగబడతుందో
ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు
రాగం అనురాగం ఎర వేసి జత చేరి
కన్నీట ముంచుతుందిరా
-- మిడిసిపడే --

పాము విషం సోకిన వాడు ఆయువుంటే బతికేస్తాడు
కన్నె వలపు కరిచిన వాడు నూరేళ్ళకి తేరుకోడు
సొగసు చూసి మనసిచ్చావా బందీగా నిలబడతావు
నీ కలలే విరిగిననాడూ కలతే నీ తోడవుతుంది
లేదు ఏ సౌఖ్యం రవ్వంత సంతోషం ఈ ఆడరాని ప్రేమలో
-- మిడిసిపడే --

No comments: